గజ్జలమ్మ జాతర పోస్టర్లను ఆవిష్కరించిన ఎంపీపీ ఆప్క గజ్జరాం

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో ఘనంగా జరుపుకునే శ్రీ గజ్జలమ్మ జాతర పోస్టర్లను ఆదివారం ఎంపీపీ ఆప్క గజ్జరాం ఆవిష్కరించారు. ఈ నెల 21 నుండి 23 వరకు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు