బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఎంపీపీ గొమాస శ్రీనివాస్ వీరంగం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో జరుగుతున్న చేపల పెంపకం, పచ్చళ తయారీపై రైతులకు ఇస్తున్న శిక్షణ శిబిరంలో బీఆర్ఎస్ కు చెందిన బెల్లంపల్లి ఎంపీపీ గొమాస శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న రైతులకు జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పంపిణీ  చేపట్టగా, ఆ సమయంలో అక్కడకు వచ్చిన సదరు ఎంపీపీ.. కార్యక్రమానికి తనను ఎందుకు పిలవలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దలితుడిడనే కారణంతోనే తనను పిలువలేదనంటూ ప్రోగ్రాం కోఆర్డీటనేర్ డాక్టర్​కోట శివకృష్ణతో పాటు ఇతర శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు. అందరి అంతు చూస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో అక్కడే ఉన్న శాస్త్రవేత్తలతో పాటు శిక్షణ పొందుతన్న రైతులంతా అవాక్కయ్యారు.