9 కోట్లతో ఏరుగట్లలో అభివృద్ధి : లక్కినేని అలేఖ్య

పెనుబల్లి, వెలుగు: రూ.9కోట్లతో ఏరుగట్ల గ్రామాన్ని అభివృద్ధి చేశామని ఎంపీపీ లక్కినేని అలేఖ్య తెలిపారు. పెనుబల్లి మండల పరిషత్​ఆఫీసులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో గడిచిన నాలుగేండ్లలో గ్రామంలో రూ.1.26కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.15కోట్లతో డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు, రూ.1.80కోట్లతో ఏరుగట్ల నుంచి మండాలపాడుకు, రూ.2.29కోట్లతో ఏరుగట్ల నుంచి చౌడారంకు బీటీ రోడ్లు నిర్మించామన్నారు. 

రైతు వేదిక కోసం రూ.30లక్షల స్థలాన్ని లక్కినేని వీరయ్య జ్ఞాపకార్థం ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలిపారు. వీటితోపాటు రైతు వేదిక, కల్యాణ మండపం, పైపులైన్​నిర్మాణం, శ్మశానవాటిక, డంపింగ్​యార్డు పనులు చేసినట్లు వివరించారు. 108 మంది పోడు రైతులకు పట్టాలు ఇచ్చామని, 70 మంది పేద రైతులకు అసైన్డ్​పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు