
- ఎంపీడీఓ సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం
- దళితురాలుననే విలువ ఇస్తలేరని ఆవేదన
మెదక్ (రేగోడ్), వెలుగు: రేగోడ్ మండల పరిధిలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు జరిగినా ఎంపీడీవో తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సరోజన బుధవారం జనరల్ బాడీ మీటింగ్ బైకాట్ చేశారు. గంట ముందు ఆఫీస్ స్టాఫ్‌తో ఫోన్ చేయించి మీటింగ్ ఉందని సమాచారం ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎంపీడీవో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆఫీస్ కు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్లిపోతున్నారో తెలియడం లేదన్నారు. తాను దళితురాలిననే తనకు విలువ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ తీరుకు నిరసనగానే జనరల్ బాడీ మీటింగ్ ను బహిష్కరించినట్టు తెలిపారు. ఆమె వెంట వైస్ ఎంపీపీ వినీల, కోఆప్షన్ మెంబర్చోటు మియా, ఎంపీటీసీ శ్రీకాంత్, తిమ్మాపూర్ సర్పంచ్ నిర్మల ఉన్నారు.