
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని బీబీ నగర్ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)కు రాష్ట్రానికి చెందిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా 12 ఎయిమ్స్‌లకు మొత్తం 24 మంది లోక్‌సభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ బులిటెన్‌లో వెల్లడించింది. ఇందులో తెలంగాణలోని బీబీ నగర్, భువనేశ్వర్, బిల్సపూర్, డియోఘర్, గౌహతి, విజయ్‌పూర్, జమ్మూ, జోధ్‌పూర్, మధురై, మంగళగిరి, పాట్నా, రాయ్‌పూర్, రిషికేశ్‌లలోని ఎయిమ్స్‌కు పాలక మండలి సభ్యలను నియమించారు.