మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత, రైతుబంధు సమితి జిల్లా కమిటీ డైరెక్టర్ ఎర్రబెల్లి పున్నం చందర్రావు తమ పదవులకు రాజీనామా చేశారు.. తమ రాజీనామా పత్రాలను జడ్పీ సీఈఓకు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌కు అందించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసినా.. పార్టీలో నాయకులు ఒంటెత్తుపోకడలకు , ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపికలో తన మాటను పక్కనపెట్టి వ్యవహరించిన లీడర్ల తీరును నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వారు చెప్పారు.
గూడూరులో సర్పంచ్ రాజీనామా
గూడూరు, వెలుగు : గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా గ్రామ సర్పంచ్ బోడ మంగీలాల్, మర్రిమిట్ట గ్రామ ఎంపీటీసీ వావకుడోతు విజయశ్రీహరి, సీనియర్ నాయకుడు వాంకుడోతు భద్రునాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రూపు రాజకీయాల వలన బీఆర్ఎస్ పార్టీలో తనకు విలువ లేక పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.