అచ్చంపేట, వెలుగు: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారని ఘనపూర్ ఎంపీటీసీ హరిలాల్ నిలదీశారు. బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శాంతాబాయి అధ్యక్షతన జరిగింది.
అంగన్వాడీ టీచర్లు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్, దేవరకొండ, అచ్చంపేట నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని ఏసీడీపీవో కమల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో మధుసూదన్ గౌడ్, ఎంపీవో వెంకటేశ్వర్లు, లోక్యానాయక్ పాల్గొన్నారు.