బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష - రామస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తమను ఇంటికి పిలిపించి పార్టీ మారితే ఇంట్లో గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు పెట్టిస్తానని బెదిరింపులకు గురి చేశాడని అన్నారు. కౌశిక్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేస్తే ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. కౌశిక్ రెడ్డి ఒక కుల ఆహాంకారి అని మండిపడ్డారు.
ALSO READ : కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
ఇరవై ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేశామని చెప్పిన నిరోష - రామస్వామి .. అప్పుడు ఈటల, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆగడాలు భరించ లేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన నిరోష - రామస్వామి.. 2023 అక్టోబర్ 4న బీఎస్పీ పార్టీలో చేరబోతున్నట్లుగా వెల్లడించారు.