
కామారెడ్డి, వెలుగు: ఫండ్స్ కేటాయించడం లేదని కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీటీసీ గాంధీ జయంతి నాడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులోని గదులను ఊడ్చి, బూజు దులిపారు. వివరాల్లోకి వెళ్తే... సదాశివనగర్ మండలం ధర్మారావుపేటకు చెందిన నాయని మహిపాల్‌యాదవ్ బీజేపీ తరఫున ఎంపీటీసీగా గెలిచారు.
నాలుగేండ్లుగా 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం వినూత్నంగా నిరసనకు దిగారు. సదాశివనగర్ ఎంపీడీఓ ఆఫీసులోని గదులు, ఎంపీపీ చాంబర్‌ను ఊడ్చి, బూజు దూలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అందరినీ సమానంగా చూడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులే వివక్ష చూపడం కరెక్ట్ కాదన్నారు.