బీఆర్ఎస్​కు ఎంపీటీసీల రాజీనామా

 

  • కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​కు షాక్​

కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం చింతకుంట–1, ఎలగందల్​ ఎంపీటీసీలు​ ఎమ్మెల్యే గంగు ల కమలాకర్​కు షాక్​ఇచ్చారు. బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు ప్రకటించారు. కొత్తపల్లి మండలం చింతకుంట ఎంపీటీసీ పట్టెం శారద, ఈమె భర్త లక్ష్మీనారాయణ- పార్టీకి రాజీనామా చేస్తూ లెటర్​ను అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు పంపించారు. తాను సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్​బాబు నాయకత్వంలో కాం గ్రెస్​లో చేరుతున్నట్టు అందులో తెలిపారు.

మరోవైపు సుడా డైరెక్టర్, ఎలగందల్​ఎంపీటీసీ మంద రమేశ్​గౌడ్​ బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్​కు లెటర్​ రాశారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను అందలమెక్కించడం తనను బాధించిందన్నారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి ​సీఎం అయ్యాక ఉద్యమకారులకు గుర్తింపునిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు లెటర్​లో పేర్కొన్నారు.