తెలంగాణలో తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు..

తెలంగాణలో తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు..

తెలంగాణలో ఎంపీటీసీ స్థానాలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 147 గ్రామాలు జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడనున్నది. ప్రస్తుతం 5,857 ఎంపీటీసీలు ఉండగా..  విలీన గ్రామపంచాయతీలను లిస్ట్ నుంచి తొలగించిన తర్వాత దాదాపుగా 150 నుంచి 250 ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

గత ఎన్నికలతో పోలిస్తే  ఈ సారి జీపీలు, వార్డులు పెరగనున్నాయి. గతంలో 12,769 పంచాయతీలకు, 1,13,314 వార్డులకు ఎన్నికలు జరగగా.. ఈ సారి 12,845 జీపీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  

మంగళవారం (ఫిబ్రవరి4) ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వివరాలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  కాగా, రాష్ట్రంలో పాతవి 539 ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలు ఉండగా..  ఈ సారి 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే గతంతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాలు తగ్గనుండగా.. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి.  కాగా, మేడ్చల్ జిల్లాలో 60 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇక్కడ సగం జీపీలు సిటీలో కలిశాయి.  రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 30 వరకు జీపీలు తగ్గాయి.