
హైదరాబాద్ : కాసేపట్లో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్ లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయబోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎన్ని దశల్లో నిర్వహిస్తారు అన్నదానిపై పూర్తి వివరాలు తెలపనున్నారు. 3గంటల 15 నిమిషాలకు ఈ ప్రకటన విడుదల కానుంది.