ఇందిరమ్మ కమిటీల్లో మాకు స్థానం కల్పించాలి:ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి

ఇందిరమ్మ కమిటీల్లో మాకు స్థానం కల్పించాలి:ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కమిటీల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్​గౌడ్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ దేవి రవీందర్​ప్రభుత్వాన్ని కోరారు. 

గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్, పంచాయితీ ప్రత్యేక అధికారి, గ్రామంలోని కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో ఇందిరమ్మ కమిటీ వేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కరెక్ట్​కాదన్నారు.

కులగణన జరిగినా..లేకున్నా..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్​చేశారు. సమావేశంలో నాయకులు దేవేందర్​ గౌడ్​, శివ, మోహన్​ రెడ్డి, అశోక్​కుమార్, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.