సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై జిల్లా కలెక్టరేట్ లో ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు విషయంలోనూ లబ్ధిదారుల నుంచి ఎంపీపీ అక్రమ వసూళ్లు చేసినట్లు తెలిపారు.
గతంలో ఎలాంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి అమ్ముకున్నా వారిపై కూడా విచారణ జరపాలని ఎంపీటీసీలు కోరారు. తమ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు జిల్లా సీఈఓ, కోదాడ ఆర్డీవోను ఆదేశించారు.