
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రోకు విదేశీ యూట్యూబర్, వ్లాగర్ మిస్టర్ అబ్రాడ్ ఫిదా అయ్యారు. నెల రోజుల కిందట సిటీని సందర్శించిన ఆయన మెట్రోలో ప్రయాణించారు. ప్యారడైజ్ నుంచి లక్డికాపూల్ వరకు ప్రయాణించి, మెట్రోలో పరిశుభ్రత, సెక్యూరిటీ సిస్టంను మెచ్చుకున్నారు. అచ్చం లండన్ లో ఉన్నట్లు సైన్ బోర్డులు, రూట్ మ్యాపు ద్వారా గమ్యాన్ని ఈజీగా చేరుకున్నట్లు తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపారు.
స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బందిని చూసి అచ్చం ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిస్టంలా ఉందంటూ ప్రశంసించారు. మధ్యలో అమీర్ పేటలో దిగిన అబ్రాడ్.. అమీర్ పేట మెట్రో జంక్షన్ ను లండన్ మెట్రోతో పోల్చారు. మెట్రో సీటింగ్ చూస్తే అమెరికా మెట్రో గుర్తొస్తుందన్నారు. అనంతరం అసెంబ్లీ మెట్రో స్టేషన్ చుట్టూ పక్కల ఉన్న గ్రీనరీ చూసి ఫిదా అయ్యారు.