మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మొదలు

మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మొదలు

‘ఈగల్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. ప్రస్తుతం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌’  షూటింగ్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాయి. ముంబై బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం మహారాష్ట్రలోనే జరిగింది. తాజాగా నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మొదలుపెట్టారు.  అక్కడి రేర్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

రవితేజతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉంటుందని మేకర్స్ చెప్పారు.  ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ తో రూపొందుతున్న పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సూపర్ స్పీడ్‌‌‌‌‌‌‌‌తో షూటింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తున్న మేకర్స్.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.