ఏ భాష మూవీ అయినా… తనదైన స్టైల్ లో కథను మలిచే డైరెక్టర్ హరీష్ శంకర్. కామెడీ, మాస్, యాక్షన్ కింగ్ రవి తేజ.ఈ ఇద్దరి కాంబోలో మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. అసలు ఈ మిస్టర్ బచ్చన్ కథ ఏంటి? రవితేజ, హరీష్ ల కాంబో ఖాతాలో మరో హిట్ పడ్డట్లేనా? లెట్స్ సీ....
రవితేజ మాస్ యాక్షన్ కు.. కమర్షియల్ డైరెక్టర్ డైరెక్షన్ తోడేతే ఎలా ఉంటుందో... మనకి తెల్సిందే. అయితే.. హరీష్ శంకర్ ఐదేళ్ల గ్యాప్ తరువాత... సినిమా రావడం, మాస్ మహరాజ హీరో అవ్వడంతో.. సినిమాపై భజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ కట్, సాంగ్స్ తో సినిమాకు ఊపు వచ్చింది. వరుస హాలిడేస్ కావడంతో... నెల రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. సినిమాను రిలీజ్ చేసారు మేకర్స్
ఆర్కెస్ట్రా సింగర్ గా జీవిస్తున్న రవితేజకు.. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ జాబ్ వస్తుంది. సిన్సియర్ ఆఫీసర్ కావడంతో.. సస్పెండ్ అయ్యి, ఇంటికి తిరిగి వస్తాడు. తండ్రి తనికెళ్ల భరణి, తల్లి గౌతమి ఇంటికి కొడుకు రావడంతో సంతోషిస్తారు. ఊర్లో నార్త్ ఇండియన్ అమ్మాయి భాగ్యశ్రీ బోర్సేను చూడగానే ప్రేమలో పడతాడు. సస్పెండ్ అయి ఖాళీగా ఉండడంతో.. ఆర్కెస్ట్రా వాయిస్తుంటాడు. అమితాబ్ బచ్చన్ పాటలతో... భాగ్యశ్రీని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడం, సస్పెన్షన్ ఎత్తేయడం ఒకేసారి జరుగుతాయి. ఈ టైంలో జగపతిబాబు ఇంట్లో ఇన్ కం ట్యాక్స్ రైడ్ కు రావాలని.. ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు. జగపతి బాబు ఇంట్లో సోదాలలో ఏం దొరకుతాయి? అసలు జగపతిబాబు ఎవరు? జగపతి బాబుకు రవితేజకు సంబంధం ఏంటి? రైడ్స్ ముగించుకుని రవితేజ పెళ్ళి టైం కి వస్తాడా? ఇదంతా సినిమాలో చూడాల్సిందే..
రవితేజ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ భుజాన వేసుకుని మూవీని పరిగెత్తించాడు. మాస్ యాక్షన్ హీరోగా... డైలాగ్స్ పండించి, ఫైట్స్, రొమాన్స్.. వాట్ నాట్ అన్నీ అదుర్స్ అనిపించాడు. భాగ్యశ్రీ బోర్స్ ను చాలా అందంగా చూపించారు. ఫస్ట్ సినిమా కావడంతో.. కాస్త ఎక్సప్రెషన్స్ వీక్ అనిపించాయి కానీ.. గ్లామర్ క్వీన్ లా మెరిసింది. ఇక సత్య కామెడీ సినిమాకు హైలెట్ అయ్యింది. జగపతిబాబు పాత్రలో జీవించినా.. మరీ సిల్లీగా చూపించారు. చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ ల కామెడీ ఓకే అనిపించింది.
కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న హరీష్ శంకర్.. ఈ సినిమాపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు. ఫుల్ స్పీడ్ ఉండే హరీష్ సినిమా.. కాస్త డల్ అయ్యింది. కథలో కంటెంట్ తగ్గింది. అసలు సినిమా సెకండ్ హాష్ కు గానీ స్టార్ట్ కాదు. ఇక సెకండ్ హాఫ్ లో ఏదో ఊహిస్తే..దాన్ని కూడా సాదాగా లాగేసాడు. పవర్ఫుల్ జగపతిబాబు రోల్ ను.. వీక్ చేసాడు.సినిమా ఒకే ఇంట్లో సోదా చేస్తూ సాగడంతో పెద్దగా ఇంట్రస్టింగ్ అనిపించదు. మాస్ ఆడియన్స్ కు నచ్చ వచ్చు.ఫైట్స్, కామెడీ, సాంగ్స్ ఉండడంతో... బి క్లాస్ ఆడియన్స్ భుజాన వేస్కుంటారనడంలో సందేహం లేదు.
- రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్
- ఐదేళ్ళ తరువాత.. హరీష్ శంకర్ సినిమా రిలీజ్
- మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చిన హరీష్ శంకర్
- భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్
- పీపుల్స్ మీడియా బ్యానర్
- టిజి విశ్వ ప్రసాద్ ప్రొడ్యూసర్
- కామెడీ, మాస్ యాక్షన్ తో రవితేజ
- అందాల ఆరబోతతో అందంగా కనిపించిన భాగ్యశ్రీ
- కామెడీ, ఫైట్స్, సాంగ్స్ హైలెట్
- ఇంకాస్త కంటెంట్ యాడ్ చేస్తే బ్లక్ బస్టర్ అయ్యేది
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్
- ఎండింగ్ లో పస లేదు
- మాస్ ఆడియన్స్ కు నచ్చే మిస్టర్ బచ్చన్