మాధవ్, సిమ్రన్ శర్మ జంటగా ‘పెళ్లిసందడి’ ఫేమ్ గౌరీ రోణంకి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. జేజేఆర్ రవిచంద్ నిర్మించారు. ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్ మొదటి పాటతో ఇంప్రెస్ చేసింది.
తాజాగా యాక్టర్ శివాజీ ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘వస్సాహి వస్సాహి’ అంటూ సాగే పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్‌తో కంపోజ్ చేయగా శివశక్తి దత్తా ఆకట్టుకునే లిరిక్స్ అందించారు.
శ్రీరామచంద్ర ఎనర్జిటిక్‌గా పాడాడు. ‘సౌందర్య సార, మకరంద ధార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి’ అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.