‘బిగ్‌బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఆగస్టు 18న సినిమా విడుదలవుతోంది. శనివారం ‘ఉల్టా పల్టా’ అనే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సోహైల్ మాట్లాడుతూ ‘కథ వినగానే చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించింది. సినిమా కోసం 15 రోజులు వర్క్ షాప్స్ చేశాం.
రియల్‌గా ప్రెగ్నెన్సీ అంత బరువుండే ప్రోస్తటిక్స్ వాడాము. సినిమా మొదలైన కొత్తలో కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడా ప్రెగ్నెన్సీ మీద కామెడీ డైలాగ్స్ పెట్టలేదు.
హుందాగా ఈ కథను తెరకెక్కించాం. సినిమా చూశాక సిస్టర్స్, మదర్‌ను హగ్ చేసుకుంటారు. ఈ సినిమా ఒప్పుకున్న టైమ్‌లో మా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్స్‌గా ఉన్నారు. వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్ వుమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా.
ఇకపై కూడా ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తాను’ అన్నాడు. ‘ఇదొక బ్యూటిఫుల్ మూవీ. ఎంత ఫన్ ఉంటుందో అంత ఎమోషన్ ఉంటుంది’ అని చెప్పింది రూప. శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ ‘అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా.
ఇదొక సెన్సిటివ్ సబ్జెక్ట్. సోహైల్, రూప పోటీ పడి నటించారు’ అని చెప్పాడు. చిన్న సినిమాగా మొదలై.. ట్రేడ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అని నిర్మాతలు చెప్పారు.