
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించిన హారర్ మూవీ ముని. హారర్ కాన్సెప్ట్ తో 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటినుండి ఈ సినిమాకు సీక్వెల్స్ తెరకెక్కిస్తూ వస్తున్నాడు లారెన్స్. అలా వచ్చినే కాంచన, గంగ, కాంచన 3 సినిమాలు. అలా ఈ సిరీస్ లో వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇక ఇప్పుడు కాంచన 4ను తెరకెలెక్కించే పనిలో ఉన్నాడట లారెన్స్.
తాజాగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు దర్శకుడు లారెన్స్. రానున్న సెప్టెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. అయితే.. తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారట. ప్రస్తుతం ఈ భామకు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి మృణాల్ కెరీర్ లో వస్తున్న మొదటి హారర్, కామెడీ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మృణాల్. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మృణాల్ తెలుగులో ప్రభాస్ సరసన సినిమా చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మిలిట్రీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. రరెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో రానున్న ఈ పాన్ ఇండియా మూవీలో మృణాల్ ను ఫిక్స్ చేశాడట దర్శకుడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది.