మోడీ కోసం మృత్యుంజయ హోమం

బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద బీజేపీ నేతలు మౌన ధర్నా చేపట్టనున్నారు. పంజాబ్‎లో ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్‎‎ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రేపు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర మౌన ధర్నా చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‎లో నిర్వహించే ఈ మౌన ధర్నాలో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.

మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. మృత్యుంజయ హోమాల నిర్వహణపై బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హోమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే ఈ మృత్యుంజయ హోమంలో బండి సంజయ్‎తో పాటు బీజేపి ముఖ్య నేతలు పాల్గొంటారు.