కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోటీ చేస్తా : మృత్యుంజయం

రాజన్నసిరిసిల్ల,వెలుగు : వరద నీటిని కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ పబ్బం గడుపుతోందని ఆల్​ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కటకం మృత్యుంజయం విమర్శించారు. గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామన్నారు. సిరిసిల్ల నుంచి తానే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోటీ చేస్తానన్నారు.  

రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ఆల్​ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మేకల కమలాకర్, లక్ష్మీనారాయణ గౌడ్, బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.