ఖమ్మం..... ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ పై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు అంబెద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. సీఎం కేసీఆర్ తో రాజ్యాంగ పై చర్చించేందుకు , ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఒక నియంతృత్వ రాజ్యాంగన్ని తీసుకురావటానికి ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు మందకృష్ణ.
ఇవి కూడా చదవండి:
ప్రధానిపై అసభ్యంగా మాట్లాడినందుకు సుమొటోగా కేసు పెట్టాలి