బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల సమస్యలపైనా ఉద్యమిస్తా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ

బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల సమస్యలపైనా ఉద్యమిస్తా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ

పంజాగుట్ట/బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పోరాటమే కాదు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు ఏదైనా కష్టం వస్తే వారి సమస్యలపైనా ఉద్యమిస్తానని ఎమ్మార్పీఎస్​అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, శ్రీవైదిక పీఠం, వైదిక బ్రాహ్మణ సంఘం, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల సంయుక్తాధ్వర్యంలో సోమవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ పాల్గొని మాట్లాడారు. 

సమానత్వం లేకపోవడంతోనే అగ్రవర్ణాలు బలపడి, వెనుకబడిన వర్గాలు బలహీనపడ్డాయన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుందన్న సూత్రాన్ని పాటిస్తానన్నారు. వర్గీకరణకు బ్రాహ్మణ, సంఘాలు, ఆర్యవైశ్య, కురుమ సంఘాలు మద్దతుగా నిలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అలాగే మందకృష్ణ సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ కార్యక్రమంపై మీట్ ది  ప్రెస్ నిర్వహించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.వీరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ పాల్గొన్నారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంద‌‌కృష్ణ సమాధాన‌‌మిచ్చారు.