Mrs Movie: అత్తారింట్లో.. కొత్త కోడలి కష్టాలు చివరికి ఏమైంది.?

Mrs Movie: అత్తారింట్లో.. కొత్త కోడలి కష్టాలు చివరికి ఏమైంది.?

స్ట్రీమ్ ఎంగేజ్ : 

  • టైటిల్ :  మిసెస్  
  • ప్లాట్ ఫాం : జీ 5
  • డైరెక్షన్ :  ఆరతి కడవ్
  • నటీనటులు :  సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా

రిచా(సన్యా మల్హోత్రా) పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుంటుంది. భర్త దివాకర్ కుమార్ (నిశాంత్ దహియా) గైనకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌. పెళ్లి రోజున వాళ్ల మామయ్య (కన్వల్జిత్ సింగ్) నవ్వుతూ.. ‘నువ్వు ఇకనుంచి మా కూతురువి’ అంటాడు. ఆ మాటలు విని రిచా చాలా సంతోషిస్తుంది. కానీ.. అసలు కథ ఆమె మెట్టినింట్లో అడుగు పెట్టిన తర్వాత మొదలవుతుంది. మెట్టినింట్లో కోడలు నిర్వర్తించాల్సిన బాధ్యతల పేరుతో ఆమెని ఇబ్బంది పెడుతుంటారు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా ఆమెని ఎవరూ గుర్తించరు. 

ALSO READ | మరోసారి స్టెప్పులేసేయండి: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

పైగా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట చేసేటప్పుడు ఫుడ్ తిన్నందుకు అత్త మందలిస్తుంది. మామ వంటగదిలో కూడా సంప్రదాయాలు పాటించాలని పట్టుపడతాడు. భర్త కూడా ఆమెని సరిగ్గా పట్టించుకోడు. రిచా తన కష్టాలను  తల్లికి చెప్తే.. ఆమె కూడా ‘నువ్వు అవన్నీ నేర్చుకోవాలి’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రిచా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? తెలియాలంటే ఈ సినిమా చూడాలి.