సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)..ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది మృణాల్. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టబోతుందీ అమ్మడు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది.
ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తాను తెలుగు ప్రేక్షకులకు రుణపడి పోయానని వ్యాఖ్యానించింది. ప్రేక్షుకులు తనను తెలుగమ్మాయిని చేసేశారంటూ వేదికపై సాష్టాంగ నమస్కారం చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఇప్పటి వరకు తారలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడం వరకే చూశాం కానీ మృణాల్ మాత్రం ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం.
ALSO READ :- Motorola Edge 50Pro: మోటరోలా ఎడ్జ్ 50 ప్రో వచ్చేసింది..ధర,ఫీచర్లు ఇవిగో..
ఆమె మనసులో తెలుగు ప్రేక్షకులంటే ఎంత గౌరవం, ప్రేమ ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మృణాల్ సాష్టాంగ నమస్కారంపై సోషల్ మీడియా వేదికలో ఏకంగా పెద్ద చర్చే జరుగుతోంది.