జాక్ పాట్ కొట్టేసిన మృణాల్.. లిస్టులో క్రేజీ స్టార్స్!

సీతారామం(SitaRamam).. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో తెలియదు కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్. ఒక తెలుగు సినిమాగా మొదలైన సీతారామం.. పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే కానీ, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. 

ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. అంతలా ఆడియన్స్ ను మాయ చేసింది మృణాల్. ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ దక్కించుకుంది. ఇటీవలే నానితో హాయ్ నాన్న చేసిన మృణాల్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలే కాకుండా.. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పేసిందట. ఆ లిస్టు కూడా పెద్దగానే ఉంది. 

వాటిలో ముందుగా తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న సినిమా ఉంది. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే లాంఛనంగా మొదలుకానుంది. మరో తమిళ స్టార్ శింబుతో కూడా ఓ సినిమా చేస్తోంది మృణాల్. ఈ ప్రాజెక్టు కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట ఈ బ్యూటీ. ఈ సినిమాలు గనుక హిట్ అయితే మరో పదేళ్లవరకు మృణాల్ కు తిరుగులేదు అనడంలో ఎలాంటి అతిశయం లేదు. మరి ఈ సినిమాలి మృణాల్ కు ఎలాంటి బూస్టప్ ను ఇస్తాయో చూడాలి.