సీతారామం(Sita ramam) సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకుర్(Mrunal thakur). ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో చాలా మంది ఫెవరెట్ గా మారిపోయింది ఈ బ్యూటీ. దీంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్నలో హీరోయిన్ గా చేస్తోంది. ఏ సినిమా రిలీజ్ కాకంముందే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యింది మృణాల్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
- ALSO READ | యాక్షన్, ఎమోషన్తో పాటు మెసేజ్ కూడా
ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నటిగా ఓకే భాషలో సినిమాలు చేస్తూ అదే చట్రంలో ఇరుక్కోవాలని నాకు లేదు. అన్ని రకాల పాత్రలో నటించాలనేది నా కోరిక. మూస పాత్రలో నటించడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు. అందుకే అన్నీ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకులు కూడా నా నుండి ఇదే కోరుకుంటున్నారు.. అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.