సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటించిన సినిమా పిప్ప(Pippa) అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మృణాల్.. ఇక్కడ ఎంట్రీ ఇవ్వక ముందే ఉత్తరాదిన బుల్లితెర మరియు వెండి తెరపై మంచి గుర్తింపును మృణాల్ సొంతం చేసుకుంది. హిందీలో మృణాల్ గత రెండేళ్లుగా 'పిప్ప' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో సాగుతుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఏకంగా ఏడాది పాటు కఠిన శిక్షణ తీసుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఏడాదికి పైగా కష్టమైన లొకేషన్స్ లో పిప్ప షూటింగ్ ను నిర్వహించారట. మృణాల్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించింది. ఈ ఏడాదిలోనే థియేటర్ల ద్వారా పిప్ప సినిమాతో మీ ముందుకు రాబోతున్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పిప్ప పరిస్థితి అటు ఇటు కాకుండా ఉందట. ఆర్థిక పరమైన విషయాల కారణంగా పిప్ప సినిమా ను థియేట్రికల్ రిలీజ్ చేయడం నిర్మాత రోన్ని కి సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఎంతో కష్టపడి మృణాల్ చేసిన పిప్ప సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ద్వారా డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసేందుకు గాను నిర్మాత రోన్ని అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నవంబర్ 10న ఈ మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ALSO READ :- కాంగ్రెస్ లో చేరిన వివేక్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్
హీరో, హీరోయిన్ ఎంత కష్టపడి నటించినా కూడా నిర్మాత నిర్ణయం ఫైనల్. కనుక ఆయన ఓటీటీ స్ట్రీమింగ్ కి సినిమా ను ఇవ్వడంతో మృణాల్ ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.