
తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వం వహించిన "సీతారామం" సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఆతర్వాత తెలుగులో వచ్చిన హాయ్ నాన్న కూడా సొప్పర్ హిట్ అవడంతో ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. అయితే ఇటీవలే నటి మృణాల్ ఠాకూర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ హాట్ టాపిక్ గా మారింది.
అయితే మృణాల్ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో అమ్మాయిలు జుట్టు ముడి వేసుకోవడానికి ఉపయోగించే హెయిర్ క్లిప్ ఎంత ప్రమాదకరమో చూపించారు. అంతేగాకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెయిర్ క్లిప్ పెట్టుకోవడంవలన వెనుక సీట్ కి తగిలి తలలో చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని కాబట్టి కారు నడిపే సమయంలో హెయిర్ క్లిప్ ధరించవద్దని సూచించింది. మంచి విషయాన్ని షేర్ చెయ్యడంతో నెటిజన్లు మృణాల్ ని అభినందిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి మృణాల్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తమిళ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ ని తీసుకున్నారు. కానీ డేట్లు కుదరకపోవడంతో శృతి హాసన్ డెకాయిట్ సినిమా షూటింగ్ కి హాజరు కాలేకపోతోంది. దీంతో శృతి స్థానంలో మృణాల్ ని తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్ అరోరా దర్శకత్వం వహిస్తున్న "సన్ ఆఫ్ సర్దార్ 2" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితోపాటూ మరో 4 సినిమాల్లో నటిస్తోంది.