సర్దార్‌‌‌‌‌‌‌‌కు జోడీగా.. మృణాల్ ఠాకూర్

సర్దార్‌‌‌‌‌‌‌‌కు జోడీగా.. మృణాల్ ఠాకూర్

సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్.  ప్రభాస్ సినిమా ‘కల్కి 2898 ఏడి’లోనూ అతిథి పాత్ర చేసింది.  ‘సీతారామం’లోని సీత పాత్రతో మృణాల్ మన తెలుగమ్మాయే అనేంతలా చేరువయింది. చీరకట్టుతో అంతలా మన ఆడియెన్స్‌‌‌‌ను ఇంప్రెస్ చేసిన మృణాల్.. ఇప్పుడు పంజాబీ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఆమె అజయ్ దేవగన్‌‌‌‌కు జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సర్దార్‌‌‌‌‌‌‌‌ 2’. ప్రస్తుతం లండన్‌‌‌‌లో షూటింగ్ జరుగుతుండగా,  వీడియో ఒకటి లీక్ అయింది. అందులో పాటియాలా సూట్,  హెవీ జ్యూలరీ ట్రెడిషనల్ పంజాబీ అమ్మాయి గెటప్‌‌‌‌లో కనిపిస్తోంది మృణాల్. అజయ్ దేవగన్‌‌‌‌, సంజయ్ దత్‌‌‌‌ లీడ్ రోల్స్‌‌‌‌లో పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  

అప్పట్లో ‘మర్యాద రామన్న’కు రీమేక్‌‌‌‌గా దీన్ని తెరకెక్కించారు. గతంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌‌‌‌గా నటించగా, ఈసారి మృణాల్‌‌‌‌ను తీసుకున్నారు. షూట్‌‌‌‌లో తన గెటప్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఈ చిత్రంతో అక్కడివారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వరుణ్‌‌‌‌ ధావన్‌‌‌‌కు జంటగా ఓ లవ్‌‌‌‌ స్టోరీలో నటిస్తోంది మృణాల్. డేవిడ్ ధావన్‌‌‌‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘హై జవానీ తో ఇష్క్‌‌‌‌హోనా హై’ అనే టైటిల్‌‌‌‌ ప్రచారంలో ఉంది.  ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  మొత్తానికి బాలీవుడ్‌‌‌‌లో వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌తో బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌.