MS DHONI: ధోనీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్.. సందీప్ రెడ్డి సినిమాలో ఎమ్మెస్ ధోనీ..

MS DHONI: ధోనీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్.. సందీప్ రెడ్డి సినిమాలో ఎమ్మెస్ ధోనీ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్య్ వంగ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు... దీంతో మొదటి సినిమాతో టాలీవుడ్, రెండో సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఇక ప్రభాస్ తో తీస్తున్న "స్పిరిట్" తో ఏకంగా హాలీవుడ్ లో తెలుగు సినిమా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ యాడ్ వైరల్ గా మారింది.. 

అయితే ఈ ప్రకటనలో ప్రముఖ ఇండియన్ మాజీ క్రికెటర్ మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ తో కలసి "ఈమోటోరాడ్" సంస్థని ప్రమోట్ చేశాడు. దీనికోసం ఆనిమల్ సినిమాలోని కొన్ని సీన్స్ ని రిఫరెన్స్ గా తీసుకుని షూట్ చేశాడు. ఈ యాడ్ లో ఎమ్మెస్ ధోనీ యానిమల్ సినిమా రణబీర్ కపూర్ కనిపించిన లుక్ లో కనిపించాడు. అలాగే యానిమల్  సినిమాలో రణబీర్ కపూర్ హార్లీ డేవిడ్సన్ బైక్ మీద వచ్చే సీన్ ని బేస్ చేసుకుని ధోనీ ఈమోటోరాడ్ కి చెందిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పై కనిపించాడు. హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి.. ఇక చివరిలో "ది ఫిల్మ్ విత్ సందీప్ రెడ్డి వంగా" అనే టైటిల్ రావడంతో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా సందీప్ రెడ్డి ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ కమాండర్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి..

ALSO READ | Court Collections: బాక్సాఫీస్ కలెక్షన్లతో కుమ్మేస్తున్న కోర్ట్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?