'బజ్ బాల్..' ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు ఎక్కువుగా వినపడే పదం ఇదే. దూకుడుగా ఆడటమే బజ్ బాల్ కాన్సెప్ట్. అంతకుమించి మరొకటి లేదు. టెస్ట్ మ్యాచ్ కదా! ఐదురోజులు తీరుగ్గా ఆడదామన్నా ఆలోచన ఉండదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లయిన వన్డే, టీ20 తరహాలో ధనాధన్ మెరుపులు ఉంటాయి. బౌలింగ్ శైలి అలానే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు.
ప్రత్యర్థి ఎవరైనా వేదిక ఏదైనా.. ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటివరకు ఇదే తరహా ఆట తీరును కొనసాగించింది. భారత్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇదే విధానాన్ని ఫాలో అవుతామని చెప్పి తొలి టెస్ట్ గెలిచి చూపించారు. సిరీస్ మొత్తం ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తామని.. అసలు భయపడమని ఇప్పటికే కోచ్ మెక్కలం చెప్పుకొచ్చాడు. వైజాగ్ లో జరగబోయే రెండో టెస్టుకు భారత్ పై నలుగురు స్పినర్లతో బరిలోకి దిగుతామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ బజ్ బాల్ కు అసలు కారణం వెనుక ధోనీ ఉన్నాడని స్టోక్స్ అన్నాడు.
గతంలో నేను పూణే వారియర్స్ తరపున ఆడాను. ఆ జట్టుకు ధోనీ కెప్టెన్ గా, స్టీపెన్ ఫ్లెమింగ్ కోచ్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కలిసికట్టుగా తీసుకుంటూ జట్టు విజయం కోసం ఆరాటపడతారు. నేను, మెక్కలం కూడా ఎప్పుడూ వీరిద్దరిలా ఉండడానికి ప్రయత్నిస్తాం. మేమిద్దరం ఎప్పుడూ వారినే ఫాలో అవుతూ ఉంటాం. అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
భారత్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా తొలి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ ఫుల్ జోష్ లో ఉంది. మరోవైపు ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు రాహుల్, జడేజా రూపంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరమవ్వడం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న వైజాగ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, భారత క్రికెటర్లు వైజాగ్ చేరుకున్నారు.
Ben Stokes And Brendon McCullum Try To Follow The CSK Way
— SportsTiger (@The_SportsTiger) January 31, 2024
?: BCCI/ICC#benstokes #StephenFleming #BrendonMcCullum #indvseng #engvsind pic.twitter.com/QmmIHTLLTv