
టీమిండియా స్టార్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అంటే ఏ బౌలర్ కైనా దడ పుట్టాల్సిందే. ప్రపంచ స్టార్ బౌలర్లందరినీ వీరిద్దరూ అలవోకగా ఆడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వీరు క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఎంతటి బ్యాటర్ కైనా పీడకలలు ఉంటాయి. వారి కెరీర్ లో ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉంటారు. ధోనీ, కోహ్లీ కూడా కొంతమంది బౌలింగ్ ఆడడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరూ తమను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో చెప్పారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
మహేంద్ర సింగ్ ధోనీ:
యార్కర్లను కూడా ఎలా బౌండరీకి తరలించాలో ధోనీకి బాగా తెలుసు. అయితే ఒక కార్యక్రమంలో ధోనీ తమ కెరీర్ లో బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరని అడిగితే వెంటనే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పేర్లు చెప్పాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ ఆడడానికి మాత్రం మహేంద్రుడు ఇప్పటీకీ ఇబ్బందిపడుతున్నాడు. వీరిద్దరూ తమ వైవిధ్యాలతో ధోనీని ఇప్పటికీ ఛాలెంజింగ్ గా మారారు. వీరి అనూహ్య డెలివరీలను మిస్టర్ కూల్ ఆడడంలో విఫలమవుతున్నాడు. తడబడుతూ తరచూ బౌల్డ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇదంతా పక్కనపెడితే ధోనీ ఇప్పటికీ ఆల్ టైం బెస్ట్ ఫినిషన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపువరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరి బౌలింగ్ ఆడలాంటే ఏ జట్టుకైనా అతి పెద్ద సవాలే.
ALSO READ | RC16: సినీ, క్రికెట్ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ధోనీ ఆగమనం.. మేకర్స్ క్లారిటీ!
విరాట్ కోహ్లీ:
ప్రపంచంలో కోహ్లీపై ఆధిపత్యం చెలాయించే బౌలర్ పేరు చెప్పడం కష్టం. కానీ కోహ్లీకి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవాలంటే చాలా కష్టమట. ఈ విషయాన్ని తాజాగా కోహ్లీనే స్వయంగా చెప్పాడు. బుమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని.. అతన్ని ఎదుర్కొనేటప్పుడల్లా ఒక పెద్ద ఛాలెంజ్ నా ముందు ఉందనే ఫీలింగ్ నాకు కలుగుతుందని కోహ్లీ అన్నాడు. కోహ్లీ ప్రస్తుత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. మరోవైపు బుమ్రా గాయం కారణంగా తొలి నాలుగు మ్యాచ్ లను దూరం కానున్నాడని సమాచారం.