Jharkhand Election 2024: జార్ఖండ్ ఎలక్షన్స్.. ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భార్య సాక్షి బుధవారం(నవంబర్ 13) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధోనీ రాంచీలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్న తర్వాత తమ ఫేవరేట్ క్రికెటర్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆరెంజ్ కలర్ నెక్ టీ షర్ట్ లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మహేంద్రుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 

ధోనీని జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అసెంబ్లీ ఎన్నికల కోసం అతని ఫోటోను  ఉపయోగించడానికి ధోనీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నట్టు తెలిపింది. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీని నియమించారు.

ALSO READ | IND vs AUS: ఆస్ట్రేలియాకు వెళ్లని రోహిత్.. ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్న హిట్ మ్యాన్

ఐపీఎల్ 2025 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ఆటగాళ్ల విషయానికి వస్తే ఐదుగురిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. అతని కోసమే పాత రూల్ ను మళ్ళీ ఐపీఎల్ లో ప్రవేశ పెట్టినట్టు తెలుస్తుంది.