
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజయవంతంగా నడిపిన కెప్టెన్. అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ ను అందించిన ఏకైక కెప్టెన్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు 5 సార్లు టైటిల్స్ అందించాడు. తన క్రికెట్ కెరీర్ లో ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నా.. కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. తన గురించి విన్న పుకార్ల లో ఒకటి ధోనీ పంచుకున్నాడు.
ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ తాను ఇప్పటివరకు విన్న హాస్యాస్పదమైన పుకారు గురించి చెప్పాడు. " ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ధోనీని.. మీరు ఇప్పటివరకు విన్న ఒక అర్ధం లేని పుకారు గురించి చెప్పాలని కోరింది. దీనికి ధోనీ స్పందిస్తూ చిరు నవ్వుతో ఇలా అన్నాడు .. " నేను రోజుకు ఐదు లీటర్ల పాలు తాగుతాననే పుకారు నాకు నవ్వు తెప్పించింది. నేను రోజంతా ఒక లీటరు పాలు తాగేవాడిని. కానీ నాలుగు లీటర్లు అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువే".అని ధోని అన్నాడు. ధోనీ సమాధానం విని ఈ ఈవెంట్ యాంకర్ కూడా ఆశ్చర్యపోవాదం విశేషం.
MS DHONI ON MOST RIDICULOUS RUMOURS ON HIM. 😀❤️
— Tanuj (@ImTanujSingh) April 22, 2025
pic.twitter.com/EhTJgzKSJ1
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో చెన్నై ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచింది. మిగిలిన 6 మ్యాచ్ ల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆప్స్ కు చేరతాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటి దారి పట్టడం ఖాయం. నెట్ రన్ రేట్ కూడా మైనస్ ల్లో ఉండడం చెన్నైకు ఉంది. దీంతో తర్వాత ఆడబోయే మ్యాచ్ ల్లో భారీగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. చెన్నై ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
►ALSO READ | PSL 2025: ఆ పాక్ క్రికెటర్ కంబ్యాక్ ఇస్తే కోహ్లీ కంటే పెద్ద స్టార్ అవుతాడు: కరాచీ కింగ్స్ ఓనర్