MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్‌టైమ్ రికార్డు

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్‌టైమ్ రికార్డు

భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయస్సులోనూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా మహేంద్రుడు.. ఫీల్డింగ్‌లో తన విన్యాసాలతో అలరిస్తున్నాడు. ఆదివారం(మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఐపీఎల్ చరిత్రలో 150 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడిగా ధోని నిలిచాడు. సిమర్‌జీత్ సింగ్ వేసిన రైజింగ్ డెలివరీని జితేష్ శర్మ నేరుగా కీపర్ చేతుల్లోకి కొట్టడంతో ధోనీ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 146 క్యాచ్‌లు, ఫీల్డర్‌గా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. 144 క్యాచ్‌లతో.. దినేష్ కార్తీక్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లు

  • 150 క్యాచ్‌లు: ఎంఎస్ ధోని (కీపర్‌గా 146, ఫీల్డర్‌గా 4)
  • 144 క్యాచ్‌లు:  దినేష్ కార్తీక్ (కీపర్‌గా 136, ఫీల్డర్‌గా 8)
  • 118 క్యాచ్‌లు: ఏబీ డివిలియర్స్ (కీపర్‌గా 28, ఫీల్డర్‌గా 90)
  • 113 క్యాచ్‌లు:  విరాట్ కోహ్లీ
  • 109 క్యాచ్‌లు: సురేష్ రైనా