హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించి, ప్రోత్సహించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) ముందుకొచ్చింది. స్కూల్ ప్రీమియర్ లీగ్ పేరిట యంగ్‌స్టర్స్ కోసం టీ20 లీగ్‌ను ప్రకటించింది. బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సపోర్ట్‌తో అండర్14 బాయ్స్, అండర్ 16 గర్ల్స్ కేటగిరీల్లో ఎనిమిది జట్లతో ఆగస్టు 27 నుంచి స్కూల్ లీగ్ తొలి సీజన్ నిర్వహించనుంది.
ఈ లీగ్ కోసం ఆగస్టు 20న నాచారంలో డీపీఎస్ క్యాంపస్‌లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి. ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆగస్టు 17వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలని పల్లవి, డీపీఎస్ (నాచారం) విద్యాసంస్థల సీఓఓ మల్కా యశస్వీ తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం 7396386214, 7618703508 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
లీగ్‌లో సత్తా చాటిన టాప్5 ప్లేయర్లకు హైదరాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ సెంటర్లో ఆరు నెలల ఫ్రీ కోచింగ్‌తో పాటు, పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తామని ప్రకటించారు.