ఎంఎస్ ధోనీ ప్రీమియర్ లీగ్ పోటీలకు .. బెల్లంపల్లి విద్యార్థి ఎంపిక

ఎంఎస్ ధోనీ ప్రీమియర్ లీగ్ పోటీలకు ..  బెల్లంపల్లి విద్యార్థి ఎంపిక

బెల్లంపల్లి, వెలుగు: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ(ఎంఎస్ డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 అండర్ 14 క్రికెట్ పోటీలకు బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాలయంలో చదువున్న విద్యార్థి రిత్విక్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో రిత్విక్ ప్రతిభ కనబర్చి ఈ పోటీలకు ఎంపికయ్యాడు.

ఎంఎస్ డీసీఏ హరికేన్స్ జట్టు తరుపున రిత్విక్ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ లీగ్​లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 10 మంది క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ తరుపున రూ.5 లక్షల ఉపకార వేతనం అందజేయనున్నట్లు పల్లవి విద్యా సంస్థల సీఈఓ యశస్వి తెలిపారు.