MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ధోనీ నడిపిస్తున్నాడా.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ కూల్

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ధోనీ నడిపిస్తున్నాడా.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ కూల్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్సీ టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చేస్తున్నాడు. ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించారు. రుతురాజ్ కెప్టెన్సీలో సూపర్ కింగ్స్ గత సీజన్ లో  ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఫ్యాన్స్ తో క్రికెట్ ప్రేమికులకు ఒక అపోహ ఉంది. అదేంటంటే.. చెన్నైకు పేరుకే గైక్వాడ్ కెప్టెన్.. కానీ గ్రౌండ్ లో అంతా ధోనీనే శాసిస్తాడు. అతను చెప్పినట్టు అందరూ చేస్తారు అనుకుంటారు. ఈ వార్తలకు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ధోని తెర వెనుక తన నిర్ణయాలు అమలు చేస్తున్నాడనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. జియోస్టార్‌లో మాట్లాడుతూ.."రుతురాజ్ కొంతకాలంగా మాతో ఉన్నాడు. అతనికి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వభావం ఉంది. ఇదే అతన్ని కెప్టెన్ గా ఎంపికయ్యేలా చేసింది. నేను సూచనలు ఇస్తే, అతను వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని సీజన్ ప్రారంభానికి ముందే నేను అతనికి చెప్పాను. అతను తన సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి స్పేస్ ఇవ్వాలనుకున్నాను.

ALSO READ | Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా బలవుతున్న టీమిండియా ఆల్ రౌండర్

నేనే నిర్ణయాలు తీసుకుంటున్నానని ఊహాగానాలు ఉన్నాయి. కానీ నిజం ఏమిటంటే 99 శాతం నిర్ణయాలు అతనివే. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ల వంటి కీలక అంశాల వరకు అతనే చెప్పినట్టే జరుగుతాయి. నేను మార్గదర్శకత్వం అందించడానికి మాత్రమే ఉన్నాను.గైక్వాడ్ కెప్టెన్సీని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు". అని ధోనీ చెప్పాడు. 

ఐపీఎల్ సీజన్ 18 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. హాఫ్ సెంచరీ చేసి కెప్టెన్సీ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం (మార్చి 28) రాయల్ ఛాలెంజర్స్ తో తలబడుతుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.