భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఆదరణ, అభిమానం మాటల్లో వర్ణించలేనిది. నాలుగేళ్ల క్రితం(15 ఆగస్ట్ 2020) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మహేంద్రుడి చూపు కోసం.. ఇప్పటికీ అభిమానులు పోటెత్తుతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యాలు. ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నా.. ప్రత్యర్థి జట్టు ఏదైనా స్టేడియం పసుపు రంగు మయం అయిపోయింది. ఆఖరికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతనికి అభిమానులుగా మారిపోతున్నారు.
అలాంటిది అంతటి గొప్ప క్రికెటర్‌ని కలవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే ఓ అభిమాని ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. ఏకంగా 23 రోజుల పాటు సైకిల్‌పై 2100 కిమీ దూరం ప్రయాణించి చెన్నై చేరుకున్నాడు. రాత్రి వేళల్లో.. ఎన్నో అడవులను, ప్రమాదకర ప్రదేశాలను దాటుకుంటూ తన ప్రయాణాన్ని సాగించాడు.
బిహార్‌కు చెందిన గౌరవ్ అనే యువకుడు మహేంద్రునికి వీరాభిమాని. అతను ఢిల్లీలో ఉంటున్నాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఎలాగైనా అతనిని కలుసుకోవాలనుకున్నాడు. వెంటనే తన వద్దనున్న సైకిల్‌పై ప్రయాణం మొదలుపెట్టాడు. అలా మొదలైన అతని ప్రయాణం పలు రాష్ట్రాలను దాటుకుంటూ చెన్నై చేరుకోడానికి 23 రోజులు పట్టింది.
Also Read:సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
చివరకు చెన్నైలోని చేపాక్ క్రికెట్ మైదానం సమీపంలో గుడారం వేసుకుని ధోనీతో భేటి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమాచార న్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గౌవర్‌ను విచారించి, అతడి కోరిక తెలుసుకొని అభినందించడంతో పాటు నచ్చచెప్పి పంపించారు. అయితే అతను మాత్రం దిగ్గజ క్రికెటర్‌ను కలిసే వరకు చెన్నైని విడిచిపెట్టనని తెలిపాడు.
"నేను ధోనీకి పెద్ద అభిమానిని. ధోనిని వ్యక్తిగతంగా కలుసుకుని అతని ఆటోగ్రాఫ్ తీసుకోవాలనేది నా కల.అంద కోసమే ఇక్కడివరకూ వచ్చాను. ఆయన్ను ప్రత్యక్షంగా చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లను.." అని గౌవర్ వెల్లడించాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లీగ్ దశలో ఒకే ఒక మ్యాచ్ మిగిలివుంది. మే 18న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల మ్యాచ్ కానుంది. ఈ పోరులో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించనుంది.