రూ. 15 కోట్ల నష్టం..ఇద్దరు వ్యాపార వేత్తలపై కేసు పెట్టిన ధోనీ

రూ. 15 కోట్ల నష్టం..ఇద్దరు వ్యాపార వేత్తలపై కేసు పెట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2017 నాటి క్రికెట్ అకాడమీ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మిహిర్ దివాకర్,సౌమ్య విశ్వాష్‌లపై క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు దివాకర్ 2017లో ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఒప్పందం నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, వాటా ఆదాయాన్ని చెల్లించాలి. అయితే,ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. 

మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాష్‌ కు రిమైండర్‌లు, లీగల్ నోటీసులు కూడా పంపబడ్డాయని..కానీ ప్రయోజనం లేదని నివేదికలు చెబుతున్నాయి. విధి అసోసియేట్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ తమను రూ.15 కోట్ల మేర నష్టపరిచిందని తెలిపారు.