ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం గొప్ప వారి లక్షణం. అలాంటి లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖచ్చితంగా ఉంటాడు. ఎంత పేరు, ప్రఖ్యాతులు సంపాదించినా తన మూలాలు మాత్రం మాహీ మర్చిపోడు. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు, ఐపీఎల్‌లోనూ తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్లరూపాయల ఆస్తులు, అంతకుమించి కోట్లాదిమంది అభిమానులు. ఇన్ని సంపాదించుకున్నా సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు ఎంఎస్ ధోని. తాజాగా తన గొప్పతనాన్ని తెలిపే ఒక సంఘటన చోటు చేసుకుంది.
అతని పేరు రాందాస్. చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద అభిమాని. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. అతని వయసు 103 సంవత్సరాలు. వయసుతో సంబంధం లేకుండా తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను సపోర్ట్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నాడు. అతని అభిమానానికి ధోనీ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. స్వయంగా అతని ఇంటివద్దకు వెళ్లి.. ఆ ముసలి తాతను పలకరించాడు. ధోనీ తన ఇంటికి రావడంతో ఆ తాత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ధోనీ చెన్నై జెర్సీని బహుమతిగా ఇస్తూ.. చెన్నైను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ తాత అని తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
రాంచీలో ఇటీవలే ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మహేంద్ర సింగ్ ధోని ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రైమ్ స్పోర్ట్స్ అనేది అతని చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్ యాజమాన్యంలోని సంస్థ. కెరీర్ ప్రారంభంలో ధోనీని ప్రోత్సహించిన తన స్నేహితుడి కోసం ప్రచారం చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
MS Dhoni gifted a signed CSK Jersey to 103-year-old CSK fan..!!👌👌#IPL2024 #SRHvRR #RRvsSRH #Natarajan #T20WorldCup24 #FridayVibes #gntm #TimnasDay #RahulGandhi pic.twitter.com/BN2R21yYMq
— jeetu maher (@Jeetu8290) May 3, 2024