IPL 2025: హెలికాఫ్టర్ షాట్ అదిరింది.. పతిరానా యార్కర్‌ను సిక్సర్ కొట్టిన ధోనీ

IPL 2025: హెలికాఫ్టర్ షాట్ అదిరింది.. పతిరానా యార్కర్‌ను సిక్సర్ కొట్టిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వయసుతో పాటు ఫామ్ కూడా పెరుగుతుంది. 43 ఏళ్ళ వయసులో కూడా అతను సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. గత సీజన్ లో సిక్సర్లతో అలరించిన మహేంద్రుడు ఈ సారి కూడా అదే ఫామ్ ను కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. 10 నెలల పాటు ఐపీఎల్ సీజన్ కు దూరమైనా ప్రాక్టీస్ సెషన్ లో దుమ్ము లేపుతున్నాడు. శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరానా బౌలింగ్ యార్కర్ ను హెలికాఫ్టర్ షాట్ ఆడుతూ సిక్సర్ గా మలిచాడు. ధోనీ కొట్టిన ఈ స్ట్రెయిట్ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అద్భుతమైన యార్కర్లు వేయడంలో పతిరానా దిట్ట. శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తర్వాత అదే యాక్షన్ తో యార్కర్లు వేయగల బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో కూడా పతిరానా తన యార్కర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. అయితే ధోనీ మాత్రం తనదైన శైలిలో సిక్సర్ కొట్టడం హైలెట్ గా మారింది. ధోనీ ఇంకా ఫామ్ లో ఉన్నాడని చెప్పడానికి ఈ షాట్ సరిపోతుందని అభిమానులు అంటున్నారు. ఈ సీజన్ లో ధోనీ అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు. రూ.4 కోట్ల రూపాయాలు మాత్రమే ధోనీ తీసుకోనున్నాడు. 

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలిగిన ధోనీ సీజన్ మధ్యలో మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఈ సీజన్ లో చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ ధోని తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఈ మాజీ కెప్టెన్ మొత్తం 73 బంతుల్లో 14 ఫోర్లు, 13 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్‌ 220.55 గా ఉండడం విశేషం. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఆదివారం (మార్చి 23) ఈ మ్యాచ్ జరుగుతుంది.