![Dhoni: మూడు రికార్డులపై కన్నేసిన ధోని](https://static.v6velugu.com/uploads/2023/03/his-last-IPL-his-last-IPL_9xDHkAVZyE.jpg)
ఎంఎస్ ధోని..ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది ..ధనాధన్ బ్యాటింగ్. టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. వరల్డ్ క్రికెట్లో బెంజ్ మార్కును క్రియేట్ చేశాడు. ఆటగాడిగా రాణిస్తూనే..టీమిండియాకు కెప్టెన్గా సక్సెస్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా..ఐపీఎల్(IPL)లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోని(Dhoni) చివరి ఐపీఎల్కు సిద్ధమయ్యాడు. 2023 ఐపీఎల్ ధోనికి లాస్ట్ ఐపీఎల్ కానుంది. ఈ క్రమంలో తన చివరి ఐపీఎల్లో రికార్డుల మోత మోగించేందుకు ధోని రెడీ అయ్యాడు.
21 సిక్సర్లు బాదితే..
ఐపీఎల్లో ధోని కొట్టే సిక్సర్లు హైలెట్. 2008 నుంచి తనదైన శైలిలో ధోని సిక్సర్లు బాదుతూ..అభిమానులను అలరిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు ఐపీఎల్(IPL) లో ధోని 229 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ధోనీ మరో 21 సిక్సర్లు కొడితే.. ఐపీఎల్ లో 250 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.
అత్యధిక మ్యాచులు..
ఐపీఎల్లో ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాడు కూడా ధోనినే. 2008 నుంచి ఇప్పటి వరకు ధోని 234 మ్యాచులు ఆడాడు. ఈ సీజన్‌లో చెన్నై నాకౌట్ చేరితే అతను 250 మ్యాచులు ఆడిన రికార్డు సాధిస్తాడు. ఈ మైలురాయి అందుకోవాలంటే ధోనీ 16 మ్యాచులు ఆడాల్సి ఉంది. ధోనీ తర్వాత అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా దినేష్ కార్తీక్ (Dinesh Karthik)(229) ఉన్నాడు.
5వేల పరుగుల క్లబ్ లోకి..
ఐపీఎల్లో ధోని ఇప్పటి వరకు 206 ఇన్నింగ్సుల్లో 4978 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మరో 22 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5 వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో ధోని చేరతాడు. ఐపీఎల్ చరిత్రలో 5వేల పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా కూడా చరిత్ర సృష్టిస్తాడు. అయితే సీజన్ మొత్తంలో 185 పరుగులు చేస్తే మాత్రం ఏబి డివిలియర్స్ (5162) ను అధిగమిస్తాడు.