సీఎస్కే ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్న ధోని..!

సీఎస్కే ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్న ధోని..!

మహేంధ్ర సింగ్ ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ బౌలర్ తుషార్ దేశ్‎పాండే వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి గైక్వాడ్ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో గ్రౌండ్‎లోనే విలవిలలాడిన గైక్వాడ్.. కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే.. ఈ గాయం తీవ్రంగా కావడం.. ఇంకా తగ్గకపోవడంతో ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‎కి కెప్టెన్ గైక్వాడ్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. గాయం కారణంగా గైక్వాడ్ మ్యాచ్ ఆడకపోతే ధోని జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోనున్నట్లు టాక్. 

గైక్వాడ్ గాయంపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందించారు. ఢిల్లీతో జరిగే మ్యాచులో కెప్టెన్ రుతురాజ్ ఆడతాడా లేదా అన్నది అతడు గాయం నుంచి కోలుకోవడంపై ఆధారపడి ఉందని తెలిపారు. ఇప్పటికైతే గాయం నయం కాలేదని.. అతడు  ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని పేర్కొన్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేసే ఆధారంగా రుతురాజ్ మ్యాచ్ ఆడాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఒకవేళ గైక్వాడ్ మ్యాచ్‎కు దూరం అయితే కెప్టెన్సీ బాధ్యతలు ఎవరూ తీసుకుంటారో ఇప్పటికైతే తెలియదు. 

కానీ సీనియర్ ప్లేయర్ ధోని నాయకత్వ పగ్గాలు తీసుకునే ఛాన్స్ ఉందని ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా హస్సీ వెల్లడించారు. హస్సీ వ్యాఖ్యలతో.. గైక్వాడ్ మ్యాచ్ ఆడకపోతే ధోని కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని స్పష్టమైంది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చూడాలి మరీ. మరోవైపు ధోని మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని వార్తలు వినిపిస్తుండటంతో తలా ఫ్యాన్స్‎తో పాటు సీఎస్కే అభిమానులు ఖుష్ అవుతున్నారు. 

ఇక సీఎస్కే విషయానికి వస్తే.. టీమ్ అంచనాల మేర రాణించడం లేదు. మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడకపోవడంతో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నైపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ధోని, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు అంచనాల మేర రాణించకపోవడం జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోంది. కొద్దో గోప్పో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తు్న్నాడు. ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న గైక్వాడ్ గాయపడటం చెన్నైకి ఎదురు దెబ్బగా మారింది.