నా బిడ్డ క్రికెట్ జీవితానికి భరోసా ఇచ్చాడు..ధోనీ మేలు మర్చిపోలేను:రాబిన్ మింజ్ తండ్రి

నా బిడ్డ క్రికెట్ జీవితానికి భరోసా ఇచ్చాడు..ధోనీ మేలు మర్చిపోలేను:రాబిన్ మింజ్ తండ్రి

రాబిన్ మింజ్.. ఈ పేరు క్రికెట్ లో పెద్దగా పరిచయం లేదు. అయితే ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చి ఏకంగా 3.6 కోట్ల ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ యువ ఆటగాడి కోసం పోటీ పడగా.. చివరికి గుజరాత్​ అతడ్ని సొంతం చేసుకుంది. కీపింగ్, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల ఈ టాలెంటెడ్ ఆల్ రౌండర్ ను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించారు. గుజరాత్ మింజ్ ను కొన్నప్పటికీ.. ప్రస్తుతం ధోనీ పేరు ట్రెండింగ్ లో నిలిచింది.  

రాబిన్ మింజ్ కు 21 ఏళ్ళు. జార్ఖండ్​లోని గుమా జిల్లాకు చెందినవాడు. వీరిది ఒక మధ్య తరగతి కుటుంబం. మింజ్ తండ్రి జార్ఖండ్ ఎయిర్​ఫోర్స్ సెక్యూరిటీలో పని చేస్తున్నారు. తాజాగా తన కొడుకు ఐపీఎల్ లో ఎక్కువ ధర పలకడంతో సంతోషం వ్యక్తం చేసిన మింజ్ తండ్రి.. ధోనీ గురించి గొప్ప వ్యాఖ్యలు చేశారు. మిన్జ్‌ని ఎవరూ వేలంలో తీసుకోకపోతే తన జట్టులోకి తీసుకుంటానని ధోనీ తనకు ప్రామిస్ చేసాడని.. మింజ్ తండ్రి ఫ్రాన్సిస్ వెల్లడించాడు. ధోనీ గొప్ప మనసు చాటుకోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ధోనీనే ఆదర్శంగా తీసుకొని క్రికెట్ లోకి వచ్చిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెట్ లో డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న మింజ్.. చదువును పూర్తిగా పక్కన పెట్టేశాడు.క్లబ్ క్రికెట్, అండర్​-19, అండర్-25 టోర్నమెంట్స్​లో జార్ఖండ్ తరఫున అద్భుతంగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లబ్ క్రికెట్​లో రాబిన్ 140కు పైగా స్ట్రైక్ రేట్​తో చెలరేగి ఆడటం విశేషం. ఈ క్రమంలో డొమెస్టిక్ టీ20 క్రికెట్​లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటాడు. ఒడిశాలో జరిగిన ఒక టీ20 టోర్నమెంట్​లో కేవలం 35 బంతుల్లోనే 75 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు.