ఐపీఎల్​ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా టైమ్​ ఉంది : ధోనీ

ఐపీఎల్​ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా టైమ్​ ఉంది : ధోనీ

చెన్నై:  తన రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందని సీఎస్కే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ధోనీ అన్నాడు. తర్వాతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 8 నుంచి 9 నెలల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని ఆలోగా ఆలోచిస్తానన్నాడు. ‘రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ అలా చేస్తే ఎక్కువగా ట్రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయి. నాలుగు నెలల నుంచి ఇంటికి దూరంగా ఉంటున్నా. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇంటికెళ్లి నిదానంగా ఆలోచిస్తా. ఇప్పుడే ఆ తలనొప్పిని పెట్టుకోను’ అని క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత మహీ వ్యాఖ్యానించాడు. సీఎస్కే కోసం తానెప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నాడు. అది టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసమా? బయట కూర్చోవడమా? అనేది ఇప్పుడే తెలియదన్నాడు.

 ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను ప్లేయర్లను బాగా విసిగించే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అని మహీ సరదాగా అన్నాడు. ‘ప్రతి రెండు, మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓసారి ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మారుస్తూ ఉంటా. దీనివల్ల ప్లేయర్లకు చాలా విసుగొస్తుంది. అయినా ప్రతి ఫీల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే నా రియాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడటానికి కాదు... ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి. పిచ్​, ఆటను దృష్టిలో పెట్టుకుని నా మనసు ప్రకారం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా. దానికి తగిన ప్రతిఫలం కూడా కనిపిస్తుంటుంది’ అని ధోనీ వెల్లడించాడు.