MS Dhoni: ఆ విషయం నాకు తెలియదు.. "థలా ఫర్ ఎ రీజన్" పై స్పందించిన ధోనీ

MS Dhoni: ఆ విషయం నాకు తెలియదు.. "థలా ఫర్ ఎ రీజన్" పై స్పందించిన ధోనీ

సాధారణంగా ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగానే క్రేజ్, ఫాలోయింగ్ తగ్గిపోవడం సహజం. కానీ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో దీనికి భిన్నం. ఈ స్టార్ ఆటగాడికి ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఇంత అభిమానానికి కారణం ఐపీఎల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ కెప్టెన్ గా జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. 

ఐపీఎల్ లో ధోనీ క్రేజ్ చూస్తే షాకవ్వడం గ్యారంటీ. చెన్నై ఎక్కడ మ్యాచ్ అక్కడ మహేంద్రుడి అభిమానులు వాలిపోయేవారు. ఎల్లో జెండాలతో గ్రౌండ్ మొత్తాన్ని నింపేశారు. ఒక వ్యక్తిపై మరీ ఇంతలా అభిమానం పెంచుకుంటారా అనే అనుమానం కలుగక మానదు. అభిమానులకు మహేంద్రుడి మీద అభిమానం  రోజు రోజుకు మరీ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా 7 అనే సంఖ్యను బాగా హైలెట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను సైతం ఇందులో జాయిన్ చేస్తూ ధోనీ మీద పిచ్చి ప్రేమను చూపిస్తున్నారు. 

'తలా ఫర్ ఏ రీజన్' అంటూ ప్రతిదానికి 7 సంఖ్య వచ్చేలా పిచ్చి పిచ్చి లెక్కలు వేస్తున్నారు. ధోనీని తలా అని అభిమానాలు ముద్దుగా పిలుచుకుంటారు. ఇక 7 అనే నెంబర్ ను ధోనీ బాగా ఇష్టపడతాడు. ఈ కారణం గానే 7 అనే సంఖ్యను వైరల్ చేస్తున్నారు. ఒకరకంగా 7 అనే నెంబర్ ను ధోనీ కనిపెట్టాడా.. అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. రెయిన్ బో లో 7 రంగులు, వారానికి 7 రోజులు, 7 మహా సముద్రాలు, 7 ఖండాలు అంటూ రెచ్చిపోతున్నారు. 

అభిమానులు ప్రారంభించిన సోషల్ మీడియా ట్రెండ్ 'థాలా ఫర్ ఎ రీజన్'పై టీమిండియా.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ  కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించాడు. తన ట్రెండ్ గురించి తనకు తెలియదని.. సోషల్ మీడియాలో తనను సమర్థించినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుసున్నాని.. ఇలాంటి అభిమానులు దొరికినందుకు తాను చాలా అదృష్టవంతుడనని ధోనీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ధోనీ ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అనే విషయం త్వరలో తేలనుంది.