MS Dhoni: అలా చేయకుండా ఉండాల్సింది.. నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: ధోనీ

MS Dhoni: అలా చేయకుండా ఉండాల్సింది.. నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంతో కూలో అందరికీ తెలుసు. ప్రశాంతంగా ఉండే ధోని ఎప్పుడు కూడా మనం కోప్పడినట్లు కనిపించడు. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ అభిమానులు. తన కూల్ కెప్టెన్సీతో ధోనీ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో, ఐపీఎల్ లో ఇండియాలో అందరికంటే ధోనీ టాప్ లో ఉంటాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీ ఎప్పుడైనా ఒకసారి తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. తన కోపం గురించి మాట్లాడుతూ తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు. 

Also Read:-ముగ్గురు మొనగాళ్లు లేకుండానే తొలి మ్యాచ్..

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీని మందిరా బేడి.. మీరు ఎప్పుడైనా సహనం కోల్పోయారా?" అని అడిగింది. అందుకు ధోనీ స్పందిస్తూ 2019 నాటి ఐపీల్ మ్యాచ్ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ధోనీ మాట్లాడుతూ.. "చాలా సార్లు నేను కోపానికి గురయ్యాను. ఐపీఎల్ మ్యాచ్ లలో ఒక సంఘటన నాకు ఇంకా గుర్తుంది. రూల్స్ కు విరుద్ధంగా నేను నేను గ్రౌండ్ లోకి వెళ్ళాను నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. గ్రౌండ్ లోకి ప్రవేశించినప్పుడు మీరు ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మనం సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది". అని చెప్పాడు.

అసలేం జరిగిందంటే..?

2019 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై లీగ్ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు పోటాపోటీగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది. చెన్నై విజయం సాధించాలంటే చివరి 3 బంతులకు 8 పరుగులు సాధించాలి. ఈ దశలో అంపైర్ స్టోక్స్ వేసిన ఫుల్ టాస్ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. అయితే కాసేపటికీ తన నిర్ణయాన్ని మార్చుకొని నో బాల్ కాదని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధోనీ డగౌట్ దగ్గర నుంచి వెంటన్ గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్ తో గొడవకు దిగాడు. కెప్టెన్ కూల్ ఇలా రూల్స్ బ్రేక్ చేసి మైదానంలోకి రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ మ్యాచ్ ఫీజ్ లో 50 శాతం జరిమానా విధించారు. ప్రస్తుతం ఐపీఎల్ కు సిద్దమవుతున్న ధోనీ.. ముంబై ఇండియన్స్ తో ఆదివారం (మార్చి 23) తొలి మ్యాచ్ ఆడనున్నాడు. 

               Question: Have you ever lost your cool? [Mastercard India]